ఆకాశంలో ఆశల హరివిల్లూ

ఆకాశంలో ఆశల హరివిల్లూ
ఆనందాలే పూచిన పొదరిల్లూ
అందమైనా ఆ లోకం అందుకోనా
ఆదమరచి కలకాలం ఉండిపోనా ||ఆకాశంలో||

చరణం 1

మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా
వయ్యారి వానజల్లై దిగిరానా
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా
సందెల్లో రంగులెన్నో చిలికెయ్‌నా
పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా
నాకోసం నవరాగాలే నాట్యమాడెనుగా... ||ఆకాశంలో||

చరణం 2

స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం
స్వప్నాల సాగరాల తేలే గీతం
ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం
ముత్యాల తోరణాల ముఖద్వారం
శోభలీనే సోయగాన చందమామ మందిరాన
నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా... ||ఆకాశంలో||