చూడొద్దే నను చూడొద్దే
చురకత్తి లాగ నను చూడొద్దే
వెళ్లొద్దే వదిలెళ్ళొద్దే
ఎద గూడు దాటి వదిలెళ్ళొద్దే
అప్పుడు పంచిన నీ మనసే అప్పని అనవద్దే
ఇప్పుడు పెరిగిన వడ్డీతో ఇమ్మని అడగొద్దే ||చూడొద్దే||
చరణం 1
వద్దు వద్దంటు నేనున్న
వయసే గిల్లింది నువ్వేగా
పో పో పొమ్మంటూ నేనున్న
పొగలా అల్లింది నువ్వేగా
నిదరోతున్న హృదయాన్ని లాగింది నువ్వేగా
నలుపై ఉన్న రాతిరికి రంగులు నువ్వేగా
నాతో నడిచే నా నీడ నీతో నడిపావే ||చూడొద్దే||
చరణం 2
వద్దు వద్దంటూ నువ్వున్నా
వలపే పుట్టింది నీపైనా
కాదు కాదంటూ నువ్వున్నా
కడలే పొంగింది నాలోనా
కన్నీళ్ళ తీరంలో పడవల్లే నిలిచున్నా
సుడుగుండాల శృతిలయలో వెలుగే ఇస్తున్నా
మంటలు తగిలిన పుత్తడిలో
మెరుపే కలుగునులే
ఒంటిగ తిరిగిన ఇద్దరిలో ప్రేమే పెరుగునులే ||చూడొద్దే||