ఘనాఘన సుందరా కరుణా రసమందిరా

ఘనాఘన సుందరా కరుణా రసమందిరా ||2||
అది పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ... ||ఘనాఘన||

చరణం 1

ప్రాభాత మంగళ పూజావేళ
నీ పద సన్నిధి నిలబడి
నీ పద పీఠిక తలనిడి ||2||
నిఖిల జగతి నివాళులిడదా ||2||
వేడదా.. కొనియాడదా..
పాండురంగ... పాండురంగా... ||ఘనాఘన||

చరణం 2

గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే
నిరతము నీనామ గానమే ||2||
సకల చరాచర లోకేశ్వరేశ్వరా ||2||
శ్రీకరా.. భవహరా..
పాండురంగ... పాండురంగ... ||ఘనాఘన||