ఈనాడే ఏదో అయ్యింది

ఈనాడే ఏదో అయ్యింది
ఏనాడూ నాలో జరగనిది
ఈ అనుభవం మరల రానిది
ఆనందరాగం మోగిందీ
అందాలలోకం రమ్మంది ||ఈనాడే||

చరణం 1

నింగీ నేల ఏకం కాగా
ఈ క్షణమిలాగే ఆగింది ||2||
ఒకటే మాటన్నదీ ఒకటైపొమ్మన్నదీ
మనసే ఇమ్మన్నదీ అది నా సొమ్మన్నదీ
పరువాలు మీటి నననన
సెలయేరు నేడు నననన కావాలి తోడు నననన ||ఈనాడే||

చరణం 2

సూర్యుని మాపి చంద్రుని ఆపి
వెన్నెల రోజంతా కాచింది ||2||
పగలూ రేయన్నదీ అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ నిజమే కమ్మన్నదీ
ఎదలోని ఆశ నననన ఎదగాలి బాసై నననన
కలవాలి నీవు నననన కరగాలి నేను నననన ||ఈనాడే||