నేను నేనుగా లేనే నిన్న మొన్నలా

నేను నేనుగా లేనే నిన్న మొన్నలా
లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా
ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా ||నేను||

చరణం 1

పూలచెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు
అల్లుకుంది నాచుట్టూ ఓ చిరునవ్వు
తేనెపట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో ఎవరేనువ్వు..
నా మనసుని మైమరపున ముంచిన ఆ వాన
మీకెవరికీ కనిపించదు ఏమైనా.. ఓ.. ఓ... ||నేను||

చరణం 2

చుట్టు పక్కలెందరున్నా గుర్తుపట్టలేకున్నా
అంత మంది ఒక్కలాగే కనబడుతుంటే
తప్పునాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా
చెప్పలేను నిజమేదో నాకూ వింతే
కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవా కనురెప్పలకే మాటొస్తే.. ఓ ఓ... ||నేను||