అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో ||అలలు||
వీచే గాలి నాలో జాలి తెలిపేనా నీకు
మనసు మనసు మనువైపోయే గురుతేనా నీకు
ఘడియే యుగమై బతుకే సగమై
గడిచేనిన్నాళ్ళు
వలపే వగపై తానే వరదే కురిసే కన్నీళ్ళు
కురిసే కన్నీళ్ళు...
చరణం:1
సా గా మా పా నీ సా
సా నీ పా మా గా సా
మమపా పపపా గమప గమగసా
నినిసాసస గగసాసస నీసగాగ మమపా
సాస నీని పాప మ్మ గాగ సాస నీసా
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలూ రేయీ ఒరిసీ మెరిసే సంధ్యారాగంలో
ప్రాణం ప్రాణం కలిసీ విరిసే జీవనరాగంలో
తనన ననన ననన ననన తనన ననన నాన ||అలలు||
చరణం:2
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ...
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ సందడి విని డెందము కిటికీలు తెరుచుకుంటే
నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలో గులాబి కని మల్లెలెర్రబడి అలిగే
నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా
ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మా
నా పుత్తడిబొమ్మా...
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే ||అలలు||