ప్రతీరాత్రి వసంతరాత్రి ప్రతి గాలి పైరగాలి ||2||
బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి
ప్రతి నిమిషం ప్రియా ప్రియా
పాటలాగ సాగాలి ||ప్రతీరాత్రి||
చరణం:1
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి ||2||
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసీ ||2||
మనకోసం ప్రతినిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా
మధుమాసం కావాలి ||ప్రతీరాత్రి||
చరణం:2
ఒరిగింది చంద్రవంక వయ్యారి తార వంక ||2||
విరజాజి తీగ సుంత
జరిగింది మావి చెంత ||2||
నను జూచి నిను జూచి వనమంతా వలచింది
నను జూచి ప్రియా ప్రియా
వనమంతా వలచింది ||ప్రతీరాత్రి||