నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా
నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా
గారం చేసినా నయగారం రేపినా
కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచన
నే నేనుగా లేనేలేనుగా
నా కన్నులా నీవే వెన్నెలా ఆ ఆ ||నీతో||
చరణం:1
ఇంకొంచం అనుకున్నా ఇకచాల్లే అన్నానా
వదలమంటె ఏమిటర్ధం వదిలిపొమ్మనా
పనిమాలా పైపైనా పడతావే పసికూనా
ముద్దుమీరుతున్న పంతం హద్దులోనె ఆపనా
మగువ మనసు తెలిసేనా మగజాతికీ
మొగలి మొనలు తగిలేనా
లేత సోయగానికి కూతదేనికి ||నీతో||
చరణం:2
ఒదిగున్నా ఒరలోన కదిలించకె కురదానా
కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా
పెదవోపని పదునైనా పరవాలేదనుకోనా
కొత్త ప్రేమలో వినోదం నేను నీకు నేర్పనా
సొంత సొగసు బరువేనా సుకుమారికీ
అంత బిగువు పరువేనా
రాకుమారుడంటి నీ రాజసానికి ||నీతో||