వస్తవా వస్తవా రమ్మన్న చోటికి వస్తావా

వస్తవా వస్తవా రమ్మన్న చోటికి వస్తావా
ఇస్తవా ఇస్తవా ఇమ్మన్న వన్నీ ఇస్తావా
సిగ్గులే గూట్లోపెట్టి గునగున వస్తావా
ముద్దులే పొట్లం కట్టి ధనా ధనా ఇస్తావా ||వస్తవా వస్తవా||

చరణం 1

ఈ చల్లబువ్వ ఉల్లిపాయ నంచుకుంటు ఉందాం
పిల్లగుండే గుంజేసుకుంటావా
ఆ చెట్టుమీన పిట్టగూడు కట్టినట్టు ఉన్నాం
చాతిమీద చాపేసు కుంటావా
రాసుకుంటు రేగడి మట్టి కోసుకుంటు తంగేడుపూలు
ఊదుకుంటూ తాటాకు బూర పేరంటాలే చేస్తావా
కట్టుకుంటు తిప్పల మువ్వ చుట్టుకుంటు
చీకటి కోన ఒన్ని చున్ని
జబ్బలదాకా పెళ్ళామల్లే వస్తావా వస్తవా వస్తావస్తావస్తా
వస్తవా వస్తవా మావిడి తోటకి వస్తావా
ఇస్తవా ఇస్తవా ఇమ్మన్న వన్నీ ఇస్తావా

చరణం 2

నీ ఒంపులనే గంపలలో ఎత్తుకుంటున్నా కొంపలకే ఎత్తుకుపోతంటా
నీ అల్లరినే మల్లెలుగా అందుకుంటున్నా హారముగా అల్లుకు పోతుంటా
ఓసెనీ కన్నె చేను కంచెను నేను కౌగిలింత కాపరి నేను
కన్నులలోని నీరుని నేను నన్నే జారి పోనీకు
వెల్లవంటి ఎండని నేను వెన్నెలంటి ఎంకిని నేను
ఎంకి కంటే దివ్వెను నేను నన్నే ఆరబోనీకు
ఏయ్ వస్తవా వస్తవా వస్తావా కొబ్బరితోటకి వస్తావా
వస్తవా వస్తావా మావిడి తోటకి వస్తావా