సాకీ
ఓ... భావి భారత విధాతలారా..
యువతీ యువకులారా..
స్వానుభవమున చాటు నా సందేశమిదే..
వారెవ్వా..
తాధిన్న తాకధిన్న తాంగిటకతక తరికిటతోం
పల్లవి
పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని
చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
చరణం 1
కట్నాల మోజులో మనజీవితాలనే బలిచేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశదేశాల
మనపేరు చెప్పుకొని
ప్రజలు సుఖపడగా
తాధిన్న తకధిన్న తాంగిటకతక తరికిటతోం
ఇంటా బయటా జంట కవులవలె
అంటుకు తిరగాలోయ్... తరంపం... ||2||
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలోయ్ ||2|| ||పెళ్ళి||
చరణం 2
నవభావములా.. నవరాగములా
నవజీవనమే నడపాలోయ్ ||2||
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్ ||2|| ||పెళ్ళి||