ఒకమారు కలిసిన అందం
అలలాగ ఎగసిన కాలం ||2||
కంటికెదురుగ కనబడగానే
అంతే తడబడినానే ||2||
తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కలలె మెరుపు
ఎదలోన తనపేరు కొట్టుకుంది నిన్నే
అది నన్ను పిలిచినది తరుణం
నులివెచ్చగ తాకిన కిరణం
కనులు తెరచిన కలువను చూశానే
చూశానే చూశానే ||ఒక మారు||
చరణం 1
పాత పదనిస దేనికద నస
నడకలు బ్రతుకున మార్చినదే
సాయంకాల వేళ దొరుకు చిరుతిండి
వాసనలు వాడుక చేసిందే
కుచ్చీ కూన చల్లగా.. నీ.. సా..
నను తాకే కండమల్లికా.. నీ.. సా..
సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ||ఒక మారు||
చరణం 2
పేరు అడిగితె తేనె పలుకుల జల్లుల్లో
ముద్దగా తడిశానే
పాలమడుగున మనసు అడుగున
కలిసిన కనులను వలచానే
మంచున కడిగిన ముత్యమా
నీ మెరిసే నగవే చందమా
హొ.. కనులారా చూడాలే తడి ఆరిపోవాలే
ల రలాల లర లల లాల... ఓ... ||2|| ||కంటికెదురుగ||