నీ మీద నాకు ఇదయ్యో
అందం నే దాచలేను పదయ్యో
గిజిగాడి గిచ్చుళ్లాయే చలిగాలి గిచ్చాయే
చేయించు తొలి మర్యాద యాయాయా...
నీ మీద నాకు అదమ్మో...
పందెం నీ అంతుచూస్తా పదమ్మో...
నీ కళ్లు కవ్విస్తుంటే ఆ కళ్లు మోపాయే
చేస్తాను తొలి మర్యాద యా యా యా... ||నీ మీద||
చరణం -1
నీవంటి మగ మహరాజే మగడే ఐతే
నావంటి కాంతామణికి బ్రతుకే హాయి
నీవంటి భామామణులు దొరికే వరకే
ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి
నీ వీర శృంగారాలే...
నీ వీర శృంగారాలే చూపించవా
ఒకసారి ఒడిచేరి ||నీ మీద||
చరణం -2
నీ చాటు సరసం చూసి గుబులే కలిగే
నీ నాటు వరసేచూసి వలపే పెరిగే
నీ చేతివాటం చూసి ఎదలే అదిరే
నీ లేత మీసం చూసి వయసే వలచే
నీ ముద్దమందారాలే...
నీ ముద్దమందారాలే ముద్దాడనా
ప్రతిరేయి జతచేరి ||నీ మీద||