ఓ ప్రియురాల నా మధుబాల నిజాలకలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
మల్లెమాలికలే రచించే మౌనగీతికలా
సన్నజాజులలో సుమించే సందె కోరికలా
ఓ చెలికాడా ఈ చెలికాడ ఇదేం రగడ...
నా నిను చూడ నీ జతకూడ ఇదేమి దడ
తేనె వెన్నెలతో లిఖించే ప్రేమపత్రికలా
పిల్లగాలులతో ద్వనించే వేణుగీతికలా ||ఓ ప్రియురాల||
చరణం -1
నీ పెదవిదాటే పూల ఋతువేదో
మీటింది నాలో సుఖవీణలే
నీ కనులదాటే తీపికల ఏదో
రాసింది నాకే శుభలేఖలే
ఓ ప్రియురాల నా మధుబాల నిజాలకలా
నీ నయనాల ఆ గగనాల సితారకలా
చరణం -2
నా కధలు రాసే నీ కవితలెన్నో
కరిగించె నాలో కనుపాపలే
నీ నడుముదాచే ఊయలలు ఎన్నో
పలికించె నాలో ప్రియజోలలే ||ఓ చెలికాడ|| ||ఓ ప్రియురాల||