గోవింద దామోదరా పర

పల్లవి

గోవింద దామోదరా పర
మానంద, కారణ, నారాయణా
హరి గోవింద దామోదరా ||గోవింద||

చరణం 1

లోక విరోధుల సృజియించి - అతి
బీకర స్వరముల - పోషించి . . .
అంతయుజేసి - మరల సృజింతువు
వింతా నీ లీలా - అతినంతశయన - హరి ||గోవింద||

గిరులై వెలసిన వెతలైనా నీ
కరుణను మొమును - మంచవలే ...
హరి నీ కరుణా మాసిన వేళా
సురనాధుడై నా శిరమ్ము వంచవలె