శ్రీలోలా దివ్యనామ

పల్లవి

[నారద] శ్రీలోలా దివ్యనామ దీనాపనా
మమ్మేలే దైవరాయ మా మోహనా
నమో మా మోహనా ||శ్రీలోలా||
ఘనులే మీరా మేమూ వేరా
నాటక మేలయ్యా ఓ వేషధారి
సర్వం ఏకమే సకలం నీ లీలే ||శ్రీలోలా||
[దేవకన్యలు] మనురాగభావమే ఈ సీమ
ఓ లేమా . . . ఓ భామా ||మనరాగ||
[కన్య] విరజాజి రేఖ ఓ చెలి - మరుమల్లి తీవె ఓ సఖి
కలలేలే కద మనలీలేకద - నవనందనమ్ము మనమే ||మనరాగ||
[కన్య 2] ఎందెందులేనీ విందులు - వేరెందెందు కనరాని వింతలూ
యోగులైనా మౌనులైనా మరగేరు మా నీడనే
[నారద] ఆ పాట మానవేసుర వీణా - నీ మాట బూటకం నెర
ఓ వీణా . . . ఓ జాణా . . .