మాధవ తవనామ సంకీర్తనా

పల్లవి

[రాజు] మాధవ తవనామ సంకీర్తనా - పావన కైవల్య సాధనా ||మాధవ||
[రాణి] భవభయ పాశనివారణా
[ప్రజలు] జయ జయ గోవింద నారాయణా
[రాజు] ఆదిపురుషా వరద - ఆశ్రిత మందారా
భక్త పారిజాతా - ముక్తిదాతా
ఎడద బూనినాము ఏకాదశి దీక్షా - నిరుతమదియె
రక్ష విరజాక్షా : ఘనతర పావని మోచనా
[రాజు, రాణి] ఘనతర పాపవిమోచనా
[ప్రజలు] జయ జయ గోవిందనారాయణా ||జయ||
[రాణి] ఒక్కసారి నీకు మొక్కిన కరుణించి అమరసౌఖ్య మిత్తు
నవనిలోన సంతతమ్ము నీదు సేవజేసిన ఇచ్చు
సౌఖ్యరాశి ఎన్నతరమే అగణిత కారణ : కారణా
[రాజు, రాణి] అగణిత కారణ కారణా
[ప్రజలు] జయ జయ గోవింద నారాయణా