జయ జయ నటరాజ

పల్లవి

జయ జయ నటరాజ నాదప్రియా
సకల కళా విశ్వ సంకేతా ||జయ||
నీ పద ధ్యానమున్‌ సలిపితిని - నే
నిన్నే గురువని, దైవమని - నాలో జీవమని
నా రాగ భావములే నీకు నివాళి
నా సామి ఏ వేళ కాపాడగదే నీవు
జయ జయ నటరాజ నాదప్రియా
సకలకళా విశ్వసంకేతా ||జయ||