పల్లవి
శరణు విరూపాక్ష శశిశేఖరా
పంపావతీ ప్రణయ పరమేశ్వరా ||శరణు||
సారంగ భృంగ విహంగముద్రా చతుర
తుంగభద్రా తీర్థ క్షేత్ర విహారా!
సంగీత సాహిత్య రత్నాకరా!
శృంగార రసనాట్య నటశేఖరా! ||శరణు||
ఓంకార నాదమయ మధురాక్షరా!
ఝుంకార గానప్రియ గంగాధరా!
ధర్మావతార దయా సాగరా!
ధరనేలు దొరినీవె కరుణాకర ||శరణు||