ఒకటైతివి చూపున

పల్లవి

ఒకటైతివి చూపున రెండైతివి
పోయిపారు కాలముల మూడైతివి
నలుమారు వేదాల నాల్గైతివి
నమశ్శివాయ యను ఐదైతివి
ఇంపైన రుచులందు ఆరైతివి
సొంపైన స్వరముల ఏడైతివి
సిరులం దెనిమిదిగానైతివి
చెన్నారు నవరస విజ్ఞానివి
ప్రజ్ఞానిధి సకల విద్యానిధి
ప్రార్థించు వారలకు భాగ్యానివి
మూలానివే మూల పురుషుండవే
మునులందు మణులందు నిలిచినావె
భువనాల కాపాడు నవశక్తివే
శ్రీశ్రీని కాపాడు శివశక్తివే
ఆడది మగవాడు చెరి సగముగా
అర్థనారీశ్వరుడవైనావులే
గాలైతివే వెలుగైతివే
నీరైతివే అనలమైతివే
నిన్నగా నేడుగా అన్ని కాలాలలో
జ్యోతిగా నిలిచినావె - సర్వలోకాల నిండినావే