పల్లవి
కలిగించవె భక్తులకు సదాశుభం
సాంబ ఉమేశా జగదాధార నటేశా
చాటెనేడు నీ కృపయే పాతక హారా
కదలాడి తలపయిని గంగాధర
జటాజూట భరచంద్ర ఖండదర ఆశ్రిత పాపహరా
పావకనయనా పన్నగ భూషణ హే భవ భయహర
హే త్రిపురాంతక హే 'మదనాంతక'
కైలాస సంవాస మరహరా శూలధరా శివశంకరదేవా
కారణ కారణ త్రిజగత్పాలన తాండవ ఖేలన
శివశంకర జే శివశంకర జే శివశంకర
డమ డమ డమ డమరు మ్రోగె
ఝమ ఝమ ఝమ గజ్జెలు మ్రోగ
తను మనముల కాంతులూరె రావో
కృపరాదో పూజలనందగ రావో
మనసే మృదంగమాయె తనువే తరంగ మాయె
హృదయమే విహంగ మాయెరావో ||కృపరాదో||
ప్రాణాలే హారతి మనమున సేవారతి
నీ దయనే కోరితిరావో
పువులెన్నో కోసితి పూజలు నే చేసితి
నీ చెంత డాసితిరావో ||కృపరాదో||
ప్రాణమున సాధన జీవమున భావన
నయనముల ప్రార్ధన రావో
అందాల కామిని అసమాన రాగిణి
ఆడెసుహాసిని రావో ||కృపరాదో||
తక తతకతై నాట్య విభువర
ఆడె నంది ఆడె ప్రమధులు
మ్రోగె గజ్జెలు చలిత నటనలా||