పల్లవి
ఓం నమశ్శివాయ
శ్రీశైల భవనా ! భ్రమరాంబా రమణా! మల్లికార్జునా!
బాలేందు కోటీరా! శ్రితమందార! ఫణిహారా!
సురాసురార్చిత చరణా! మల్లికార్జునా!
హరా! అఖిల భువనేశ్వరా! అంధతిమిర భాస్కరా!
శంకర! హరా! అఖిలభువనేశ్వరా! నటేశ్వరా
జటలోని మినువాకతో, పయి నటియించు నెలరేకతో
తనకెనలేనిదీ మన యెదలోనిదీ ఘనలావణ్యరూపమ్ముతో
ఉమాహృదయ మందిరా! సుందరా!
హరా! అఖిల భువనేశ్వరా!
అంధతిమిర భాస్కరా శంకరా! హరా! ||శ్రీశైలం||