పరమార్ధమే

పల్లవి

పరమార్ధమే - జ్ఞాన పరమార్ధమే
శివజ్ఞాన పరమార్ధమే
స్మరియించి - నిను స్మరియించు కొనియాడు
భువిలోని ప్రజలెల్ల 'పరమార్ధమే'
కనులందే నిలిచావయా - తండ్రి
కనులందే నిలిచావయా - ఆరు
కమలాల వెలిశావయా
కళలను వెలిగావయా - అన్ని
కళలను వెలిగా వయా
గౌరీశు ఆశీస్సు నిరతమ్ము నినుబ్రోవ
శివజ్ఞాన పరమార్ధమే . . .
ఊరుంది పేరుంది గుణముంది, సుఖముంది లోకమ్మె నీలో వుంది
నీలాల మేఘాల నిండారు కైలాసగిరి నిన్ను రమ్మన్నది
నీయందు మనమున్న నీ మాత నీ తండ్రి నానంద పరబవోయి
ఓ శరవణభవ నేడు చూడవో
కవయిత్రి తపించు మొగము నీవే
ఆగ్రహం విడు లోకవిషయమే కనలేని శిశువు నీవా
మార్చుకో మనం తెలుసుకో నిజం అలుకేలా పలుకరాదా
జాలమిక చాలు ఈశునికచేర షణ్ముఖా కదలవయ్యా
ఏలుకొనవా మేలు కొనవా నన్ను దయచూడవయ్యా ||