విషయవాంఛలను

పల్లవి

విషయవాంఛలను - వేరు సేయుమా
విష్ణు భజనమును - సేయుమా
విశ్వమంతయును - విఠలునిమయమే
వేరు వస్తువులు - భ్రమసుమ్మా . . . ||విషయ||
అధర్మ శిక్షకై - అనాధరక్షకై
అవతరించు - నా హరిసుమ్మా . . . ||విషయ||
కరి ప్రహ్లదులన్ - కాపాడగా లేదె
శరణన్న విభీషణు - సంరక్షింపలేదె
తృష్ణావిషహర - దివ్యౌషధమౌ
కృష్ణనామసుధ - గ్రోలుమా . . . ||విషయ||
శ్రీ పాండురంగా - పండరి నాధా
హరి హరి విఠలా - శ్రీ పాండురంగా
పాండురంగ - పండరినాధా
పాండురంగా - పాండురంగా . . .