యశోదా నందనా

పల్లవి

యశోదా నందనా - మోహనా
అజవందిత చరణా
వసితభువన - వనమాలీ వనమాలీ
కరుణానిధీ - మేలుకోరా
ఆనందమయమీ - ప్రభాత - శోభా ||యశోదా||
కనుగొనుమా కృష్ణా
మావిగున్నపై - కోయిలపాడే
మధురగీతి నీపై
నెమలి నిన్ను - నీలమేఘమనుకొని
నృత్యము సాగించే
అఖిల జగతికాధారుడనీవె
ఆదిమూర్తినీవె
మురళీధరా - గోవర్థనధారీ
ముద్దులయ్య లేరా
రసికా వసంతా - రాధా వసంత
రక్షింపుము తండ్రీ ||యశోదా||