మేలుకోవయ్యా

పల్లవి

మేలుకోవయ్యా కరుణ నన్నేలుకోవయ్యా
మనసు నీ పయీ నిలిపిన దానా - కనులచూడు మా ఈ
నన్నేలు కోవయ్యా - కరుణ నన్నేలు కోవయ్యా ||మేలు||

చరణం 1

కులీవినుత సురపాళీ
బాలశశి మౌళీ శివా
జవరాలీ బాళిగని
జాలిబూని నన్నేలుకోవయ్యా ||మేలుకో||
ఈశా సకల జగదీశా గిరిజహృదయేశా హరా
పరమేశా ప్రేమదరి చేరి కోరి - నన్నేలు కోవయ్యా ||మేలుకో||
వరదయాంతరంగా - విభూతిసురచిరాంగా
కరుణాపాంగా - వృషభతురంగా
ఆశలు తీరగ ఆదరాన నన్నేలుకోవయ్యా
కరుణా నన్నేలు కోవయ్యా ||మేలుకో||