పల్లవి

జయ జయ సుందర నటరాజా ఓ నటరాజా
దయగనరావా హే మునిరాజా
జయమహదేవ - శివమహాదేవ

చరణం 1

విరసినది సుమాల బాలా
దరిసెను నీ పదాల చేరా
కరుణతో యీ పూజలందుకోరా
జయజయ సుందర నటరాజా ||జయ||
నవనవ చంద్ర కళావసంత
సువిమల యోగి విరాజహంస
సేవకురాలను ఏలుకోరా!
జయ జయ సుందర నటరాజా