పల్లవి
నమోనమో నటరాజా - నమామి మంగళతేజా
[అతడు] నాదమయా వేదమయా
ఆదిదేవ బ్రహ్మానందనిలయ
నభోంతరాళము నాట్య వేదికై
నటించు శుభాలు ఘటించు దేవరాయ ||నమో||
చరణం
చిద్గగనార్ణవ సీమలకానల
సద్గుణ నిర్ణు సమరూపముతో
ఉద్గీతారుతమ్ముద్ఘోషించే
సద్గురురాయాంస్తవనీయా ||నమో||
సృష్టిస్థితిలయకారణ కారణ
అష్టైశ్వర్య ప్రధాన చరణా
శిష్టయోగ సంసేవిత చరణా
విశిష్ట జ్యోతిర్లీలాధురీణ ||నమో||