పల్లవి
[రాగం] యమన్
నీ పాద సంసేవ దయసేయవా
నిజభక్తి మందార సదాశివ
నెరనమ్మినాను - కరుణించవా ||నీ||
కామితదాత చేకొనుమిదియే
కోమల పూజా ప్రసూనము
నోచిననోములు ఫలించగా
దేవదేవా పాలించవా ||నీ||
తీయనైన నీ పేరులోనే
తేనియచిందేను త్రిలోచనా
దాసురాలి ఆశతీర
దరిశనమీయగరావా ||నీ||