కానరావా దేవ దేవా

పల్లవి

కానరావా దేవ దేవా - దీనజన పోషా
శరణు నీవే - అభయమీవే
పాహి పరమేశా - శ్రీశైల మల్లీశా ||కాన||
నిన్ను నమ్మిన దీనురాలికి - ఇదా బహుమానం
వరదుడని పెను బిరుదుపొందిన - నీకె అవమానం
ఆర్తివినవా - ఆదుకొనవా - ఎందుకీ మౌనం?
ఆలకించగలేవా - నా విషాదగానం
శంకరా - అభయంకరా - నరభక్త - లోకవశంకరా
బాలేందు శేఖర - భవహరా ||కాన||
కనులరాలే రక్తధారలు - మంటిలో కలిసె
మదిని రగిలే అగ్ని జ్వాలలు మింటికే ఎగసె
విభుని కావగ - నన్ను బ్రోవగ వేగ రాలేవా
అంధకారము మాపవా - ఆత్మజ్యోతిని చూపవా
రత్నసానుశరాసనా - రజతాద్రిశృంగనికేతనా
కందర్ప - గర్వ వినాశనా భస్మాంగరాగ విలేపనా భవమోచనా
ఫణి రాజ భూషణ - వృషభ వాహన
ప్రమధ నాధ త్రిలోచనా - ఓం - నమశ్శివాయ ||
ఆ ఆ ఆ - - -