పల్లవి
భవహరణా - శుభచరణా నాగా భరణా - గౌరీ రమణా
దిక్కేలేనీ - దీనుల పాలిట - దిక్కై నిలిచిన దేవుడవయ్యా ||భవ||
నీ భక్తులకు పెన్నిధి నీవే మా కన్నులలో ఉన్నదినీవే
నిండు మనసుతో - నీవారొసగే గరికపూలకే - మురిసేవయ్యా
కన్నీటితోనే - పూజించగానే - పన్నీరుగానే భావింతువయ్యా ||భవ||
నంది వాహనం వుందంటారే కందిపోయే - నీ కాళ్లెందుకయా
మంచుకొండ - నీ ఇల్లంటారే వొళ్ళంతా యీ వేడెందుకయా
అన్నపూర్ణ - నీ అండనుండగా ఆకలి దాహం నీకెందుకయా