శ్రీశైలా మల్లయ్య

పల్లవి

శ్రీశైలా మల్లయ్య - దైవమే నీవయ్య
శ్రీ భ్రమరాంబతో వెలసిన జంగమయ్యా
మల్లయ్య : మల్లయ్య : మల్లయ్య : స్వామీ . . .

చరణం 1

ఇదియే దక్షిణ కైలాసము - ఇది నాగార్జున నివాసం
ఇందున్న శిలలే శివలింగాలు - సెలయేళ్ళన్ని దివ్యతీర్థాలు

చరణం 2

వరుస వేదుల రాశి ప్రత్యక్ష కాశీ - పాతాళ గంగకు కాణాచి
ఈ శిఖర దర్శనమే పాపహారము - భక్త కోటికి జన్మ పావనము

చరణం 3

పర్వతుడు నిను గొల్చి మెప్పించగా
చంద్రవతి మల్లెపూల పూజింపగా
మల్లిఖార్జున రూపమై నిలిచావులే
తెలుగు గడ్డకు ముక్తి నిచ్చావులే ||శ్రీశైల||