పల్లవి
[అతడు] పరుగులు తీయకే పసిదానా, ఫలితం లేదని తెలిసున్నా - 2
నేడైనా, రేపైనా జరిగేదే ఎప్పుడైనా నీ గుండెల్లో కుర్చున్నా
గుట్టంతా గమనిస్తూ ఉన్నా, వస్తున్నా
(నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా) - 2
పనిమాలా నాకు ఎదురొచ్చి, పరువాల ఉచ్చుబిగించి,
పడి చచ్చే పిచ్చిని పెంచీ, కట్టావే నన్ను లాక్కొచ్చి,
కుందేలై కుప్పించీ, అందాలే గుప్పించీ,
ఇందాకా రప్పించీ, పొమ్మనకే నన్ను విదిలించీ
వస్తున్నా నేనే వస్తున్నా, వద్దన్నా వదిలేస్తానా - 2 ||పరుగులు||
ఉలికిపడే ఊహల సాక్షి, ఉసూరనే ఊపిరి సాక్షి
బెదురుతున్నా చూపుల సాక్షి, అదురుతున్నా పెదవులు సాక్షి
నమ్మాలే నలినాక్షి, నిజమేదో గుర్తించి నీ పంతం చాలించీ
నేనే నీ దిక్కనిపించీ వస్తున్నా నేనే . . .