పల్లవి
నమ్మవేమో గానీ అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసిందీ - 2
అందుకే అమాంతం నా మది అక్కడే స్వర్గం అయినదీ,
ఎందుకో ప్రపంచం అన్నదీ, ఇక్కడే ఇలాగే నాతో ఉంది.
నిజంగా కళ్ళతో వింతగా మంత్రం వేసిందీ,
అదేదో మాయలో నన్నిలా ముంచి
వింతగా మంత్రం వేసిందీ - 2
నవ్వులు వెండి బాణాలై నాటుకు పోతుంటే, చెంపలు కెంపు
నాణాలై కాంతిని ఇస్తూ ఉంటే,
చూపులు తేనె దారలై అల్లుకుపోతుంటే రూపం ఈడు భారాలై
ముందర నిల్చుంటే, ఆ సోయగాన్నీ నే చూడగానే
ఓ రాయిలాగా అయినాను
నేనే అడిగ పాదముని అడుగు వేయమని
కదలలేదు తెలుసా నిజంగా
కళ్ళతో వింతగా మంత్రం వేసిందీ. అదేదో . . .
వేకువలోనా ఆకాశం మావిని చేరిందీ.
ఓ క్షణమైనా అధరాల రంగును ఇమ్మందీ, వేసవి పాపం చదివేసి
ఆమెను వీడింది శ్వాసలలోన తలదాచి జాలిగ కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే ఆనందమైనా వందేళ్ళు నావి
కలల తాకిడిని మనస్సు తానిదిగా
వెతికి చూడు చెలిమి నిజంగా కళ్ళతో