గజ్జలందియలు ఘల్లు

పల్లవి

గజ్జలందియలు ఘల్లు ఘల్లుమన
గంతులు వేయగ గోపాలా
బొజ్జనిండ - పాలారగించి
నీ మురళీగానము - సేయరా - నీ
వాటలాడుకోరా - నా ముద్దుల మూట గదరా గోపాలా ||ఆట||
కనికరమింతయులేక - యశోద నిన్
కట్టివైచినా - నా తండ్రీ
కట్లు విప్పెదను - పారిపోకు - నా
కన్నుల పండువు - సేయరా
నంద కుమారా నవనీతచోరా
బృందావన - భువిసంచారా
అందమెల్ల - నీ సొమ్మేరా
మా మందిరమును - విడనాడకురా