కమాన్‌ కమాన్‌ ఓ కామాక్షి

పల్లవి

కమాన్‌ కమాన్‌ ఓ కామాక్షి జంతర్‌ మంతర్‌ చూడు మీనాక్షి ||2||
కోడిగుడ్డు నుంచి నెమలి తీసి అందిస్తా చిటికేసి
మన్నుతీసి మల్లెపూవుగా మార్చేస్తా నీ సాచి ||కమాన్‌||

చరణం 1

నౌనౌనౌ మ్యూజిక్‌ ||2|| ననన లాజిక్‌ ||2||
[ఆమె] మ్యాజిక్‌ మ్యాజిక్‌ మ్యాజిక్‌ కోసం మ్యాజిక్‌ డాన్స్ మ్యాజిక్‌
[అతడు] ఎంతైనా మ్యాజిక్‌;
[ఆమె] మ్యాజిక్‌లాక్‌ మ్యాజిక్‌ రాక్‌ మ్యాజిక్‌
[అతడు] పిలక జడలను తడిమితే కురులు బారెడు పెరుగునే
బొండాంబాబుని తాకితే వచ్చేరక్తం మాయమే
ముసలిఫ్రోఫెసర్‌ కోటుజేబులో చెప్పరాని దేదో వచ్చునే
కల్లు తాగిన కన్నయ్య చేతికి ఆరోవేలు పుట్టుకొచ్చునే
పిల్లోణ్ని పిల్లగా మార్చే మంత్రం ఆడది మగాడు కాగల తంత్రం
చేస్తాగాని నరసింహ రావుల వధ ||కమాన్‌||

చరణం 2

[అతడు] రాసిన లవ్‌ లెటర్స్ ఎక్కడ దాచినా ఎక్స్‌రే కళ్ళతో చూడనా
కోరివెంట పడుతున్న పిల్లకు మీసాలు వచ్చేలాగా చెయ్యనా
హైర్‌ డై వేసుకున్న దొంగ జుట్టులో దాగిన తెలుపుని చూపనా
రేపు రాబోయే పరీక్ష పేపర్లు నోటీసు బోర్డులో పెట్టనా
పాపిన్స్ అయినా మింగేయగలను వేళ్ళను కరకర కొరికేయ్‌గలను
అన్నీ తెలుసు పరీక్షలు వస్తే హు హు
నౌనౌనౌ మ్యాజిక్‌ ననన లాజిక్‌ ||కమాన్‌||