రేపే లోకం ముగిసే

పల్లవి

[అతడు] రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు ||2||
[ఆమె] కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నులు నింపుకుని
ముందుకు ఒరిగే ఆఖరిసారిగా ప్రేమగా భువికే పొత్తులిచ్చే
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే ||రేపే||

చరణం 1

[ఆమె] రేపేలోకం రేపేలోకం ముగిసేనంటే నువు ఏం చేస్తావ్‌
[అతడు] ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతులు పంచి మరణాన్నే మరిపిస్తాలే ||రేపే||

చరణం 2

[అతడు] వలపు అనేది నిలిచెవరరు భూలోకం ముగియదులే
[ఆమె] కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగదూ చెల్లదులే
[అతడు] ప్రణయాలెన్నో రాలిపోనీ జీవన యానం సొగునులే
[ఆమె] తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే
[ఆమె] రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు ||2||
[అతడు] నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వెన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటానే ||రేపే||