పల్లవి
[ఆమె] మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రా రా రా రా
[అతడు] చిన్ని చీర కట్టాను సన్నజాజులెట్టాను రా రా రా రా
దిండు ఎంతమెత్తనా మంచమెంత గట్టిదో
చుక్కలోంక చూసుకుంటు లెక్కపెట్టుకుందాము రావే
[అతడు] ఆకలేసి దప్పికేసి అందమంటు వచ్చాను రావే రాక
ఆకులోన సున్నమేసి ఒకచెక్కలిస్తాను రావే రావే
పండు ఎంత తియ్యనో పాలు ఎంత చిక్కనో
సోకలోంక చూసుకుంటు సొమ్మసిల్లి పోదాము రావే
చరణం 1
[అతడు] నిన్ను చూడకుంటె నాకు పిచ్చిగుంటది
నిన్ను చూస్తె వయసు నన్ను మెచ్చుగుంటది
[ఆమె] కౌగిలంత కోరలేత అలసిపోతివి
రాతిరంత కునుకులేక రగిలిపోతది
[అతడు] అయ్యో కసికసి ఈడు కమ్ములేస్తే
[ఆమె] కంటిని రెప్పై కాటువేస్తా
[అతడు] ఎట్టా ఆగను చలిలో గిలిలో
[ఆమె] ఎట్టు అడగను అసలేకోసరు చాలాలే నీజోరు ||ఆకలేసి||
చరణం 2
[ఆమె] రగులుతున్న సోకుమీద మిగడున్నది
పెదవిదాటి ముద్దులాగ మారుతున్నది
[అతడు] చీకటింట చిట్టిగువ్వే రొప్పుతున్నది
వాలుకంట వలపుమంట అంటుకున్నది
[ఆమె] జల్లోపువ్వు జావలి పాడే
[అతడు] ఇల్లు ఒళ్ళు వంతిడిసావే
[ఆమె] ఎంత తీరిన ఎదలో సోదలే
[అతడు] వింత వింతగా జరిగే కధలే మోగాలి గొలితాళం ||మంచమేసి||