మనసా వాచా కర్మణా

పల్లవి

[అతడు] మనసా వాచా కర్మణా నిను ప్రేమించ
నా మనసనే వీడి కోటకే నిన్నే రాణిని చేస్తా
[ఆమె] కర్త కర్మ క్రియ నాకు నువ్వేనంట
నా వలపుల సీమకు రాజువి నువ్వే రారా దోరా
[అతడు] కదిలే వెన్నెల శిల్పం నీవని కన్నుల కోలువుంచా
కురిసే మల్లెల జడిలో ప్రేయసి నువ్వేనని తలిచా
[ఆమె] మధునుడు పంపిన వరుడే నువ్వని
మనవే పంపిచా నా మనసే అర్పించా ||మనసా వాచా||

చరణం 1

[అతడు] దిక్కులు నాలుగు అని అందరు అంటున్న
కాదు ఒకటేనని నిన్నే చూపిస్తా
[ఆమె] ప్రాణాలు ఐదు అని ఎందరు చెపుతున్న
ఒకటే ప్రాణమని మననే చూపిస్తా
[అతడు] ఎన్నడు ఓడని ప్రేమకు ఋతువులు ఆరే కాదమ్మ
[ఆమె] జంటగ సాగుతు పెళ్ళికి నేడే అడుగులువేద్దామా
[అతడు] ఇష్టైశ్వర్యం మనకందించె వరమే
ఈ ప్రేమ ప్రేమకు మనమే చిరునామా ||మనసావాచా||

చరణం 2

[అతడు] కన్నులు ఉన్నవిలా నిను చూసేటందుకులే
నాకంటికి వెలుతురిలా నువ్వుంటే చాల్లే
[ఆమె] పెదవులు ఉన్నవిలా నినుపిలిచేటందుకులే
ఆపిలిచే పేరొకటే నీదైతే చాల్లే
[అతడు] పాదం ఉన్నది కడవరకు నీతో నడిచేందుకులే
[ఆమె] అందం ఉన్నది నీ కౌగిట్లో అలసేటందుకులే
[అతడు] హృదయం ఉన్నది నిన్నే తనలో దాచేటందుకులే
[ఆమె] అది ఒక సొంతం నాకే ||మనసా వాచా||