పల్లవి
[అతడు] ఎన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలనీ అన్నాయి
ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి
దూరం పెంచినా కరిగించానుగా, కళ్ళెం వేసినా కదిలి వస్తానుగా
మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో,
ప్రతి గంటా కొలిచే ప్రేమికుడే రాడమ్మో
మన చెయ్యేపడితే అది నీకే మేలమ్మో
నన్ను నువ్వు విడిచే అవకాశం రాదమ్మో ఎన్నెన్నెన్నో. . .
అసలిట్టా నీవెంటా నేనెట్టా పడ్డానే, అనుకుంటే అప్సరస వెనా
నాగుమ్మంలోకి వస్తాదే, విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యెద్దే
చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే
ఇన్నాళ్ళు, భూలోకంలో ఏ మూలో ఉన్నావే, అందిస్తా ఆకాశాన్ని
అంతో,ఇంతో ప్రేమించావంటే, మనకన్నా పొడిచే మొనగాడే . . .ఎన్నెన్నెన్నో . . .
అలనాటి రామయ్య సంద్రాన్నే దాటాడే, బలమైన వారధి కట్టి
సీతనే ఇట్టా పొందాడే, మన మద్య నీ మౌనం సంద్రంలా నిండిందే
మనస్సేవారధి చేసి నీకింక సొంతం అవుతానే
చంద్రుడ్నే చుట్టేస్తానే చేతుల్లో పెడతానే
ఇంకా నువ్వు ఆలోచిస్తు కాలాన్నంతా ఖాలీ చేయొద్దే
మనకన్నా . . .