గోపాల మాం పాలయా!

పల్లవి

గోపాల మాం పాలయా! - కృపాలయా ||గోపా||
గోపీ విధేయా! - సురమౌనిగేయా ||గోపా||

చరణం 1

నీరధి గంభీర! - నిగమాంతసంచార!
ధారిత మందర ! - దానవసంహార!
నీరజనేత్ర ! - ఘనలీల! - లీలా గోపాలా!
రాధికాసుమ సాయకా! - సర్వాధికా !
సాధక ఫలదాయకా! - జగదాధారా!
బాధిత భవజాలా! - మాధుర్యగుణశీలా!
మోదిత వ్రజ బాలా! - మురళీ విలోలా! ||గోపా||

చరణం 2

ఇందిర - మందిర - నందకిశోర!
దాస చందన! - ఖగస్యందన!
సదానంద! - సువిధానా!
అనాది నిధనా! - అమోఘ కదనా
కనత్యనక పరిధానా! ||గోపా||