మారుబలుక వేమీ

పల్లవి

మారుబలుక వేమీ! స్వామీ!
మరచిన కారణమేమీ! నాతో
నదియాలోతు! నావ ఓటిది
నను దరి చేర్చగ రా వేమీ?
వేదశాస్త్రములు వివిధ పురాణముల్‌
చదివి యెఱుంగనురా! దేవా!
కలవు నీవని అంతర్వాణి
పలికిన పలుకే నమ్మితిరా ||మారు||