పల్లవి
శరణు శరణు ఓ కరుణాల వాలా
అరమర సేయకురా కృష్ణయ్యా నీదే దీవెనరా ||శరణు||
నే కన్నవాడూ నే పెంచు వాడూ నీ వారలేరా నీ కన్నులేరా
మాకీ పరీక్ష ఏల ప్రభో ఓ ఓ . . . ||మాకీ||
నీ లీల లేమయ్యా స్వామీ నిరంజన
అరమర సేయకుర కృష్ణయ్యా నీదే దీవనరా ||శరణు||
ఒక కంట చూపా ఒక కన్నుమూతా
నా ఆశలన్నీ అడియాసలేరా ||ఒక కంట||
ఇది న్యాయమేనా దయచూడరా ఓ . . . ఓ
దేవా పరాకా యశోదా కుమారా
అరమర సేయకురా కృష్ణయ్యా నీదే దీవనరా ||శరణు||
కృష్ణయ్యా నీదే భారము రా