ప్రభూ! దయామయా

పల్లవి

ప్రభూ! దయామయా
తొలి సంజెక్రొంజివురు దేవ నీ చిరునవ్వు
దినమణి తేజమే నీ దివ్యరూపము
పూర్ణమ్ముగాయీ భువన జాలమ్ములో
నీవేగోచరింతువయ్య దేవా
దేవా ఆనందరూపా
నిఖిలమునీ ప్రతిబింబమెకాదా ||దేవా||
నిదురనైనా మెలకువనైనా
జపము నీనామమే ప్రభో ||నిదుర||
జన్మజన్మల తపనతీర
తరణోపాయము నీ పద ధ్యానమే ||దేవా||
అహముమాసి సహనము వెలసి
శాంతి వెలుగొందరా ||అహ||
సర్వమానవ సౌజన్య భావమే
ప్రణవోపాసన ప్రేమయేకాదా ||దేవా||