పల్లవి
జయ జయ గిరిజా రమణా
జయ జయ జయ శంకర నాగాభరణా
దీనుల బాలీ దిక్కయ బ్రోచే
దేవుడ నీవె ఓ మహదేవా
నను కరుణింపగ రావా దేవా ||జయ||
సిరులూ సంపద కలిగినా గాని
సురభోగములో తేలిన గాని
పాపలనవ్వుల నోచగలేనీ
పడతీ జన్మమదేలా దేవా
నా నోములు ఇంతేనా
నేనీ జన్మములోనా
తల్లిని కానేలేనా - తల్లిని కానేలేనా ||జయ||