హరహరా ! జయకరా !

పల్లవి

హరహరా! జయకరా! శంభో!
కోరికదీరా నీ పదయుగమే
కొలుచువాడ దయరానీర త్రినయన ||హరహరా||
భగభగభగ భగ కన్నుగవా
ప్రళయకాల వహ్నీ జ్వాలలెగయా
రిపుబలము బలిగొలినా
త్రిపురహరా! విజయధరా విజయధరా!