కరుణించరా

పల్లవి

[అతడు] కరుణించరా శివశంకరా
గిరిజా మనోహరా - పరమేశ్వరా - జగదీశ్వరా
గుడిలోని నా దేవర - నా
ఒడి చిన్నబోయిందిరా - ఒడి చిన్నబోయిందిరా ||కరు||
[అతడు] ఈ దివ్య పాదాలు చాలు
నాకు ఇంకేల వేరే వరాలు
పాపాలు తొలగించరావా
పుణ్య దీపాలు వెలిగించలేవా
[ఆమె] కన్నీటి జడివానలో - ఉన్నాను నన్నాదుకో
ఇకనైన పరమేశ నువుమేలుకో
ఇకనైన ఓ దేవ నన్నేలుకో ||కరు||
[ఆమె] ఇచ్చావు అనురాగవరము - నీకే
ఇచ్చాను ఆ నోము ఫలము
ఎలుగెత్తి అడిగేను నిన్ను - ఏదీ ఆ కంటి
[అతడు] నటారాజువై ఆడుతావే - లోకాల నడిపించు
నడిపించలేవాయీ బాబును
నడిపించి కాపాడు నా బాబును ||కరు||