ఓ మహదేవా నీ పదసేవా

పల్లవి

ఓ మహదేవా నీ పదసేవా - భవతరణానికి నావా ||ఓ మహదేవా||
పన్నగహారా పార్వతీ రమణ
నిన్నే స్మరింతును నిటలనయన
ఎన్నగనౌనా ఎవ్వరికైనా
హరహర నీ మహిమా ||ఓ మహదేవా||
శోకముతోనే మానిసినై ఈలోకములోనే మనగలనా
నాకిది శిక్షా? లేక పరీక్షా? నను కరుణించవదేలా ||ఓ మహదేవా||