పల్లవి
ఓం నమశ్శివాయ - నమశ్శివాయ - నమో నమస్తే
శంభో శంకర జగత్కారణా
సకల సురాసుర సేవిత చరణా
గంభీరం భోధ ర కభరీ భర
కాలకంఠ భవ సాగరతరణా ||ఓం||
పాహి పాహి పార్వతీ మనోహర
అహిభూషణ ఐశ్వర్య ప్రదాతా
మహాదేవ కైలాస నివాసా
చంద్రమౌళి మదనారి సదాశివ ||ఓం||
పరమ పురుష జగదీశ పరాత్పర
భక్త జనావన పరమ పావనా
కరుణాన్విత గంగాధర శ్రీకర
దురితదూర పరమాత్మ నిరంజన ||ఓం||