ఈశా! గిరీశా : మహేశా!

పల్లవి

ఈశా! గిరీశా : మహేశా!
జయ; కామేశ ... కైలాస వాసా
గంగా తరంగాల : కలుషాలు మాపె
కాశీ పురాధీశ విశ్వేశ్వరా
మోక్షద్వారము ద్రాక్షారామము
భవ భయ దూరా భీమేశ్వరా
భక్తవశంకర భ్రమరాంభికా వర
శ్రీకర శ్రీశైల మల్లీశ్వరా
వాయులింగా స్మరదర్ప భంగా
ధవళాంగ : శ్రీకాళహస్తీశ్వరా
కాంచీపురీవర ఏకాంబరేశ్వర
కామేశ్వరీ వామభాగేశ్వరా
శ్రీ సుందరేశా . . . మీనాక్షీ మనోజా
నమో చిదంబర నటరాజా . . .
తరుణేందు శేఖర అరుణాచలేశ్వరా
సాకార ఓంకార అమరేశ్వరా
శ్రితజన మందార కేదారేశ్వర
రామప్రతిష్టిత - సైకత లింగా
రమ్య శుభాంగా - రామలింగా
శ్రీరామ లింగా - శ్రీరామలింగా . . .