పల్లవి
ఎంత ఘనుడవయ్యా
యదునందన ఆనందమోహన ||ఎంత||
ఎంతటి ఘనుడవు - ఎంతవంత కారిని
అంతు చిక్కదయా - నీ లీలకు ||ఎంత||
పరమ పురుష నిను నమ్మిన వారిని
సరసముగా దరికి చేరదీసి
కయ్యమో వియ్యమో తెలియని తీరుగ
కవ్వించి నవ్వించి గారడి చేసేవు ||ఎంత||
నీ ఆదరణ అర్థమేమో
నీ ఆగడములో అంతర్యమేమో
వివరింపవా కనువిప్పు సేయవా
వేదాంత వీధుల విహరించు విన్నాణి ||ఎంత||